ఎస్‌8తో యాపిల్‌కు శాంసంగ్‌ సవాల్‌ | Sakshi
Sakshi News home page

ఎస్‌8తో యాపిల్‌కు శాంసంగ్‌ సవాల్‌

Published Thu, Mar 30 2017 12:07 AM

ఎస్‌8తో యాపిల్‌కు శాంసంగ్‌ సవాల్‌ - Sakshi

న్యూయార్క్‌: ఐఫోన్‌–7 విజయంతో జోరుమీదున్న యాపిల్‌కు శాంసంగ్‌ తన కొత్త ఫోన్లతో సవాల్‌ విసిరినట్లు కనిపిస్తోంది. నోట్‌–7 ఫోన్‌తో ఫెయిలైన శాంసంగ్‌ ఇప్పుడు గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ అనే రెండు హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. వీటి ధర 720 డాలర్ల నుంచి ప్రారంభమౌతోంది. కస్టమర్లు ఈ ఫోన్లను గురువారం 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని అయితే ఇవి ఏప్రిల్‌ 21 నుంచి అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

 ఎస్‌8 ఫోన్‌లో 5.8 అంగుళాల స్క్రీన్, ఎస్‌8 ప్లస్‌లో 6.2 అంగుళాల స్క్రీన్‌ ఉంది. ఆండ్రాయిడ్‌ 7.0 నుగోట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేసే రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ 12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, వాటప్‌ ప్రూఫ్, డస్ట్‌ రెసిస్టెంట్, ఐరిస్‌/ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. కంపెనీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌ ఫోన్లతోపాటు కొత్త 360 డిగ్రీ కెమెరాను (360 డిగ్రీల్లోనూ వీడియో తీసుకోవచ్చు), వర్చువల్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ ‘గేర్‌ వీఆర్‌’ను, ఫోన్‌ డాక్‌ ‘డెక్స్‌’ వంటి పలు ప్రొడక్టులను కూడా ఆవిష్కరించింది.

ఫోన్స్‌ ప్రత్యేకతలు...
ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే: స్క్రీన్‌ డిస్‌ప్లే పెద్దదిగా ఉంటుంది. దాదాపు ఫోన్‌ మొత్తం స్క్రీనే ఉన్నట్లు కనిసిస్తుంది.

ఫేస్‌ స్కానర్‌: ముఖాన్ని స్కాన్‌చేయడం ద్వారా ఫోన్‌ను ఆన్‌లాక్‌ చేయవచ్చు.

బిక్స్‌బి: ఇది ఒక ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌. ఉదాహరణకు మీరు మీ స్నేహితుడికి ఒక స్క్రీన్‌షాట్‌ పంపాలి అనుకున్నారు. అప్పుడు మీరు మీ చేతులతో పనిలేకుండా కేవలం వాయిస్‌ ద్వారా స్క్రీన్‌షాట్‌ పంపొచ్చు. అలాగే ఇది ఇమేజ్‌లను గుర్తుపడుతుంది. స్మార్ట్‌హోమ్‌ ఉపకణాలను కంట్రోల్‌ చేస్తుంది. శాంసంగ్‌ బిక్స్‌బి.. యాపిల్‌ సిరి, గూగుల్‌ అసిస్టెంట్, అమెజాన్‌ అలెక్సాలకు గట్టిపోటి ఇవ్వనుంది.

Advertisement
Advertisement