గూగుల్ ‘అల్లో’ మెసేజింగ్ యాప్ అదిరింది | Sakshi
Sakshi News home page

గూగుల్ ‘అల్లో’ మెసేజింగ్ యాప్ అదిరింది

Published Thu, Sep 22 2016 12:58 AM

గూగుల్ ‘అల్లో’ మెసేజింగ్ యాప్ అదిరింది

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా ‘అల్లో’ అనే మెసేజింగ్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇది ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్స్‌యాప్‌లకు గట్టి పోటినివ్వనుంది. అల్లో యాప్‌ను అటు ఆండ్రాయిడ్, ఇటు ఐఓఎస్ యూజర్లిద్దరూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇందులో స్మార్ట్ రిప్లే, షేర్ చేసే ఫొటోలకు కాప్షన్ ఇవ్వడం, ఇమోజి, స్టిక్కర్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. వీటన్నింటి కన్నా ముఖ్యమైన ఫీచర్ మరొకటుంది. అదే గూగుల్ అసిస్టెంట్. ఈ ఫీచర్‌తో మనం మనకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో పొందొచ్చు. అంటే మనకు దగ్గరలోని పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్స్, రెస్టారెంట్స్ ఇలా ఏ అంశానికి చెందిన సమాచారన్నైనా పొందొచ్చు. కాగా గూగుల్ ఇటీవలే డుయో అనే వీడియో కాలింగ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement