యూరోపియన్ బ్యాంక్‌తో ఎస్‌బీఐ రుణ ఒప్పందం | Sakshi
Sakshi News home page

యూరోపియన్ బ్యాంక్‌తో ఎస్‌బీఐ రుణ ఒప్పందం

Published Sat, Jan 24 2015 12:59 AM

SBI loan agreement with the European Bank

ముంబై: యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఒక రుణ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ విలువ 100 మిలియన్ యూరోలు (దాదాపు రూ.700 కోట్లు).  దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సామాజిక, మౌలిక సదుపాయాల రంగాలకు చేయూత ప్రధాన లక్ష్యంగా గతంలో 200 మిలియన్ యూరోల రుణానికి రెండు బ్యాంకింగ్ సంస్థల మధ్య గతంలో అవగాహన కుదిరింది.

ఈ అవగాహన అమల్లో భాగంగా మూడవ విడతలో సంబంధిత నిధులను (100 మిలియన్ యూరోలు) యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అందించనుంది. 2014 జూన్, నవంబర్ నెలల్లో ఈ అవగాహన కింద రెండు విడతల్లో యూరోపియన్ బ్యాంక్ 100 మిలియన్ యూరోలను అందించింది.
 

Advertisement
Advertisement