‘డిజిటల్‌’కు ఎస్‌బీఐ దన్ను | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’కు ఎస్‌బీఐ దన్ను

Published Tue, Jan 10 2017 12:39 AM

‘డిజిటల్‌’కు ఎస్‌బీఐ దన్ను - Sakshi

చిన్న వ్యాపారులకు కార్డు లావాదేవీ ఫీజు రద్దు  
ముంబై: డిజిటల్‌ లావాదేవీలకు ఊపును ఇచ్చే దిశలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (ఎస్‌బీఐ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక టర్నోవర్‌ రూ. 20 లక్షల వరకూ ఉన్న చిన్న వ్యాపారులకు ఈ ఏడాది చివరి వరకూ (31 డిసెంబర్‌ 2017)డెబిట్‌ కార్డు లావాదేవీలపై (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌– ఎండీఆర్‌) చార్జీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కార్డు పేమెంట్ల వల్ల ప్రయోజనాలు చిన్న వ్యాపారులకు అందుబాటులోకి తేవడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌ ఒక ప్రకటనలోతెలిపింది. ప్రభుత్వ డిజిటలైజేషన్‌ కార్యక్రమం విజయవంతంలో తనవంతు కృషికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. దేశంలో మెట్రో నగరాల నుంచి గ్రామాల వరకూ పీఓఎస్‌ ఆమోదిత మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది.

Advertisement
Advertisement