ఇక ఆ ప్రకటనల్లో సెలబ్రిటీలు? | Sakshi
Sakshi News home page

ఇక ఆ ప్రకటనల్లో సెలబ్రిటీలు?

Published Sat, Apr 9 2016 1:28 PM

ఇక ఆ ప్రకటనల్లో  సెలబ్రిటీలు? - Sakshi

ముంబై: దేశంలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను పెంచే ఉద్దేశంతో సెబీ కీలక నిర్ణయం తీసుకోనుంది.  వివిధ రంగాల్లో ప్రముఖులతో మ్యూచువల్ ఫండ్  పెట్టుబడులపై ప్రకటనలకు  అనుమతిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో  సినీ, క్రీడా రంగ సెలబ్రిటీలు  ఆయా ప్రకటనల్లో కనువిందు చేయనున్నారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ  తదితర  ఆయా రంగాల సెల్రబిటీలను మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ప్రచార ప్రకటనల్లో వాడుకునే అవకాశం ఉంది.

మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టిందని  సెబీ ఉన్నతాధికారి తెలిపారు.  సెలబ్రిటీ ఎండార్స్ మెంట్ల ద్వారా పెట్టుబడుల విస్తరణకు  యోచిస్తోందని, అయితే, దీనికి వ్యక్తిగత సంస్థలకు అనుమతి లేదని తెలిపింది. సెబీ, మ్యూచువల్ ఫండ్ టాప్ ఎగ్జిక్యూటివ్ ల సమావేశంలో దీనిపై చర్చించినట్టు తెలిపారు. దీనికి సెబీ చైర్మన్ ఆమోదం కోసం పంపామన్నారు.  

మ్యూచువల్ ఫండ్ విస్తరణకు ఇది పెద్ద బూస్ట్ ఇచ్చే ఆలోచన అని  పరిశ్రమ సీనియర్లు అంటున్నారు. ప్రకటనలకు  సెబీ  సమ్మతిస్తే, ఎంఎఫ్ఐ నోడల్ ఏజెన్సీ అవుతుందని టాప్ సెబీ అధికారి ఒకరు తెలిపారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో దీనికి సమకూరనున్న రూ 120-130 కోట్ల అదనపు కార్పస్  ఫండ్ లో కొంత భాగం ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ కు,  మరో కొంత భాగం ఈ ప్రకటలనకు వినియోగించవచ్చన్నారు.

కాగా ఆయా  ప్రకటనదారులు తమ ప్రకటనల బడ్జెట్ లో ముఖ్యభాగాన్ని  డిజిటల్ మీడియా లక్ష్యంగానే ఉంటోంది. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ప్రస్తుత ప్రకటన కోడ్ 2000 లో  రూపొందించారు.  అడపాదడపా కొన్ని మార్పులను చవి చూసింది.  ఈ నేపథ్యంలో ఈ కోడ్ లో భారీ  సవరణ కోసం పరిశ్రమ పెద్దలు ఎదురు చూస్తున్నారని  విశ్లేషకులు భావన.


 

Advertisement
Advertisement