Sakshi News home page

రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓకు సెబీ ఓకే

Published Fri, Dec 1 2017 1:25 AM

SEBI okay to Reliance General Insurance IPO - Sakshi

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీ గ్రూప్‌కు చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా 1.67 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. ఈ షేర్లతో పాటు రిలయన్స్‌ క్యాపిటల్‌కు చెందిన 5.03 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో జారీ చేస్తారు. తాజాగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించే నిధులను సాల్వెన్సీ మార్జిన్‌ను, సాల్వెన్సీ రేషియోను మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తు మూలధన అవసరాలకు వినియోగించుకోవాలని రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ యోచిస్తోంది.

ఈ ఐపీఓకు మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్, క్రెడిట్‌ సూసీ సెక్యూరిటీస్‌(ఇండియా), ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, యూబీఎస్‌ సెక్యూరిటీస్, హైతంగ్‌ సెక్యూరిటీస్, ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌.. లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.  

Advertisement
Advertisement