లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

Published Tue, Jul 21 2015 11:34 AM

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌  59 పాయింట్ల లాభంతో 28వేల 472 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ  24 పాయింట్ల లాభంతో 8627 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక సెక్టార్‌ సూచీల్లో  హెల్త్‌కేర్‌ సూచీ 3.18శాతం, మెటల్‌ సూచీలు 0.90శాతం, రియాల్టీ 0.58శాతం, న ష్టపోతుండగా, ఐటి4.86శాతం, టెక్‌ సూచీలు 4.27శాతం, లాభపడుతున్నాయి.

 

ఇక నిఫ్టీ టాప్‌ గేయిన్స్‌ లిస్ట్‌లో ఇన్ఫీ 10.17శాతం, భారతీ ఎయిర్‌ టెల్‌ 4.69శాతం, హెచ్ సిఎల్‌ టెక్ 4.42శాతం, లాభపడుతున్నాయి. ఇక నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో సన్‌ ఫార్మా 12.47శాతం, విఇడిఎల్‌ 3.49శాతం, టాటాస్టీల్‌ 2.45శాతం, హిందాల్కో 2.38శాతం నష్టపోతున్నాయి. ఇక ఇన్ఫోసిస్ ఆదాయం పెరగటంతో మార్కెట్లు జోరు మీదున్నాయి. ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

మరోవైపు బంగారం ధరలు ఇంకా తగ్గుముఖంలోనే ఉన్నాయి.  10 గ్రా.  ధర 25 వేల రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొంటోందని, ధరలు తగ్గినా వినియోగాదారుల కొనుగోళ్లు పెరగడంలేదని ఎనలిస్టులు చెబుతున్నారు.  డాలర్తో పోలిస్తే రూపాయి అయిదు పైసలు నష్టపోయి 63.71దగ్గర ఉంది.

Advertisement
Advertisement