ఫెడ్‌ ఆందోళనతో నష్టాలు... | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ ఆందోళనతో నష్టాలు...

Published Thu, Dec 15 2016 12:34 AM

ఫెడ్‌ ఆందోళనతో నష్టాలు... - Sakshi

ఫెడ్‌ సమావేశం నేపథ్యంలో ఒడిదుడుకులు
95 పాయింట్ల నష్టంతో 26,603కు సెన్సెక్స్‌
39 పాయింట్ల నష్టంతో 8,182కు నిఫ్టీ   


అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక సమావేశం నేపథ్యంలో బుధవారం ఇతర ప్రపంచ మార్కెట్లలానే మన భారత స్టాక్‌  మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. చివరకు మన మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 95 పాయింట్లు నష్టపోయి 26,603 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 8,182 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, పీఎస్‌యూ, క్యాపిటల్‌ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరగ్గా, ఐటీ, రియల్టీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి.

ద్రవ్యోల్బణం తగ్గినా...: క్యూ2లో కోల్‌ ఇండియా నికర లాభం భారీగా తగ్గడంతో ఈ షేర్‌ 4 శాతం కుదేలవడం ప్రతికూల ప్రభావం చూపింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో తగ్గినప్పటికీ, అది ఎలాంటి సానుకూల ప్రభావం చూపించలేదు. ఫెడ్‌ సమావేశం నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనను ఇది ఏ మాత్రం తగ్గించలేకపోయింది.

ఫెడ్‌ కోత 25 బేసిస్‌ పాయింట్లు !
ఫెడ్‌ పాలసీ నేపథ్యంలో ఇతర వర్థమాన మార్కెట్లలానే మన మార్కెట్‌ కూడా ఒడిదుడుకులకు గురైందని జియోజిత్‌  బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌(రీసెర్చ్‌) వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో నిఫ్టీ 8,200 పాయింట్ల దిగువన ముగిసిందని తెలిపారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతుందనే అంచనాలున్నాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement