వారాంతంలో నష్టాల ముగింపు | Sakshi
Sakshi News home page

వారాంతంలో నష్టాల ముగింపు

Published Fri, Jan 25 2019 4:44 PM

Sensex Closes169 Points Lower, Nifty Settles At 10,780 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ప్రారంభ లాభాలన్నీ ఆవిరి కాగా ఒడుదుడుకుల మధ్య కొనసాగిన కీలక సూచీలు వారాంతంలో నష్టాల్లో ముగిశాయి.  సెన్సెక్స్‌ 170 పాయింట్లు కోల్పోయి 36,025 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు క్షీణించి 10,780 వద్ద ముగిసింది.నిఫ్టీ 10800కి దిగువన ముగియడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఎనలిస్టులు సూచించారు. 

మీడియా, ఆటో, మెటల్‌, రియల్టీ రంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా మిడ్‌సెషన్‌లో జీ గ్రూప్‌ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఫలితాలు నిరాశపరచడం, భూమి కొనుగోలు అంశంపై రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ కార్యాలయాల్లో సీబీఐ సోదాలు వంటి  అంశాలు  అమ్మకాలకు దారి తీసింది. ఆటో మేజర్‌ మారుతి సుజుకి ఫలితాల్లో నిరాశపర్చడంతో దాదాపు 8శాతం నష్టపోయింది.  దీంతోపాటు హీరో మోటో, టీవీఎస్‌ మోటార్‌, అశోక్‌ లేలాండ్‌, ఎండ్‌ అండ్‌, ఐషర్‌ తదితర ఆటో షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇంకా ఐసీఐసీఐబ్యాంకు, ఏసియన్‌ పెయింట్స్‌ బాగా నష్టపోయాయి. ఇన్‌ఫ్రాటెల్ 6.5 శాతం జంప్‌చేయగా.. హెచ్‌సీఎల్‌ టెక్‌, యస్‌ బ్యాంక్‌, సిప్లా, ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, టీసీఎస్, టైటన్‌, వేదాంతా, విప్రో  లాభాల్లో ముగిశాయి.

Advertisement
Advertisement