525 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

525 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు

Published Wed, Sep 25 2019 2:31 PM

Sensex dives over 500 points Nifty below 11450  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారిన సెన్సెక్స్‌ 525 పాయింట్లకుపైగా నష్టపోగా నిఫ్టీ 150 పాయింట్లు కుప్పకూలింది. దీంతో సెన్సెక్స్‌ 39600 వేల దిగువకు,నిఫ్టీ 11450 స్థాయిని కూడా కోల్పోయింది.  ప్స్తుతం సెన్సెక్స్‌ 38592 వద్ద, నిఫ్టీ 11441 వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి.  ఇన్వెస్టర్ల అమ్మకాలతో  దాదాపు అన్నిరంగాలూ కుదేలవుతున్నాయి. ఒక్క ఐటీ మాత్రం స్వల్పంగా లాభపడుతోంది.

ఆటో,బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి.  టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, ఎం అండ్‌ ఎం, మారుతి సుజుకి, యస్‌బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంతా టాప్‌ లూజర్స్‌గా  కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీసీపీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌  టాప్‌ గెయినర్స్‌ గా ఉన్నాయి.  

Advertisement
Advertisement