లిక్విడిటీ బూస్ట్ : మార్కెట్లకు ఏమైంది?  | Sakshi
Sakshi News home page

లిక్విడిటీ బూస్ట్ : మార్కెట్లకు ఏమైంది? 

Published Fri, Mar 27 2020 1:15 PM

Sensex drops 400 points Nifty below 8600 - Sakshi

సాక్షి, ముంబై:  కరోనా కష్టాల్లో ఉన్న సామాన్యులకు ఊరట కలిగించేలా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై  ప్రశంసల వెల్లువ కురుస్తుండగా, స్టాక్ మార్కెట్లో మాత్రం అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఆరంభంలోకీలక మద్దతు స్థాయిలను అధిగమించి ఉత్సాహంగా ట్రేడ్ అయిన కీలక సూచీలు ఆర్బీఐ ప్రకటన అనంతరం నీరసించాయి. భారీగా లిక్విడిటీ పెంచే విధంగా ఆర్ బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ  అన్ని సెక్టార్ల షేర్లలోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు.  1100 పాయింట్ల పైగా  ఎగిసిన సెన్సెక్స్ ఆరంభ లాభాలలన్నీ కరిగిపోయి 200 పాయింట్లపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా గరిష్ట స్థాయి నుంచి దాదాపు 200 పాయింట్లు పతనమైంది. వెంటనే పుంజుకున్నా లాభ నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.  

ప్రస్తుతం సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టంతో 29502 వద్ద  నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 8584 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 8600 దిగువకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ లోనూ ఇదే ధోరణి. ముఖ్యంగా దాదాపు 10 శాతానికి పైగా ఎగిసిన బ్యాంకింగ్ షేర్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.ఇండస్ ఇండ్ బ్యాంకు, భారతి ఎయిర్‌టెల్, మారుతిసుజుకి, హీరో మోటో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, గెయిల్ టాప్ లూజర్స్‌గా కొన సాగుతున్నాయి.  వీటితో పాటు ఎస్బీఐ, డా.రెడ్డీస్, హిందాల్కో, రిలయన్స్  కూడా నష్టపోతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, సిప్లా, కోల్ ఇండియా, యస్ బ్యాంక్,  గెయినర్స్‌గా ఉన్నాయి. 

క్రెడిట్ కార్డు బకాయిలు కూడా కట్టక్కర్లేదా?

Advertisement
Advertisement