ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌మార్కెట్లు

Published Mon, Sep 4 2017 9:24 AM

Sensex edges lower tracking weak Asian markets

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆసియన్‌ మార్కెట్ల సంకేతాలత నేపథ్యంలో మన మార్కెట్లు ఫ్లాట్‌గా  ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  సెన్సెక్స్‌  44 పాయింట్ల నష్టంతో 31,847 వద్ద, నిఫ్టీ పాయింట్లు 10 పాయింట్ లుక్షీణించి 9964   వద్ద కొనసాగుతున్నాయి.  ఆటో  లాభాలతో ఉండగా, ముఖ్యంగా మిడ్‌క్యాప్‌ సరికొత్త రికార్డు దిశగా సాగుతున్నాయి.  బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ, ఫార్మా నెగిటివ్‌గా ఉన్నాయి.  ఓలటైల్‌గా కొనసాగుతున్న మార్కెట్లలో నో అబ్జర్వేషన్‌ వార్తలతో అరబిందో ఫార్మ,   ఆకర్షణీయ విక్రయాలతో టీవీఎస్ మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ లాభాలను ఆర్జిస్తున్నాయి. అలాగే  ఎన్‌ఎండీ, కేడిల్లా హెల్త్‌ కేర్‌, లాభపడుతుండగా,  ఆదిత్యా బిర్లా క్యాపిటల్‌, అపోలో టైర్స్‌, జేకే టైర్స్‌ , ఇన్ఫోసిస్‌ నష్టపోతున్నాయి. మంత్రివర్గ విస్తరణ కొన్ని సెలెక్టివ్‌ షేర్లలో సానుకూలంగా కనిపిస్తోంది.

మరోవైపు డారల్‌ మారకంలో రుపీ లాభాలతో ఉంది.  0.03 లాభంతో రూ. 63.94 వద్ద ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement