సెన్సెక్స్‌ 300 పాయింట్స్‌ ర్యాలీ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 300 పాయింట్స్‌ ర్యాలీ

Published Mon, Feb 26 2018 4:09 PM

Sensex ends 300 points higher Nifty around 10600 - Sakshi

ముంబై : గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల ప్రభావంతో, ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి లాభాలు పండించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, చివరికి మరింత లాభాలను పెంచుకున్నాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు ర్యాలీ జరిపి 34,446 వద్ద ముగియగా.. నిఫ్టీ 92 పాయింట్లు జంప్‌ చేసి, 10,600కి దగ్గర్లో 10583 వద్ద క్లోజైంది. ఐటీ, టెక్నాలజీ, హెల్త్ కేర్ మినహా.. అన్ని రంగాల షేర్లకు నేటి ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కొనసాగింది. 

నిఫ్టీలో మారుతి సుజుకి 4 శాతం పైగా ఎక్కువగా లాభాలు పండించగా... టాటామోటార్స్, ఎల్ అండ్ టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యూపీఎల్, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. టాప్ లూజర్స్‌గా సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు నష్టాలు గడించాయి. నేటి ట్రేడింగ్‌లో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లకు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement