జైట్లీ దెబ్బకి నష్టాల్లో ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

జైట్లీ దెబ్బకి నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Published Thu, Feb 1 2018 3:57 PM

Sensex ends 50 points lower, Nifty holds 11,000 - Sakshi

ముంబై : ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌ నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. బడ్జెట్‌కు ముందు, బడ్జెట్‌ ప్రసంగం ప్రాంరభమైన తర్వాత కొద్ది సేపటి వరకు లాభాలను ఆర్జించిన మార్కెట్లు, స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులపై ఎల్‌టీసీజీ పన్ను విధించనున్నట్టు అరుణ్‌జైట్లీ ప్రకటించడంతో, మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. అనంతరం భారీ పతనం నుంచి కోలుకుని ఒడిదుడుకులుగా ట్రేడయ్యాయి. అనంతరం లాభాలను ఆర్జించినప్పటికీ... చివరికి నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు నేటి ట్రేడింగ్‌ను ముగించాయి. సెన్సెక్స్‌ 58 పాయింట్ల నష్టంలో 35,906 వద్ద, నిఫ్టీ11 పాయింట్ల నష్టంలో 11,016 వద్ద క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ కూడా 159 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఐటీ కూడా నష్టాలే పాలైంది. టాప్‌ గెయినర్లుగా ఎం అండ్‌ ఎం, ఐషర్‌ మోటార్స్‌, లార్సెన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు నిలువగా.. టాప్‌ లూజర్లుగా ఓఎన్‌జీసీ, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఉన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ బడ్జెట్‌ నేపథ్యంలో 16 పాయింట్లు బలహీనపడి 63.75గా ఉంది. 
10 శాతం పన్ను
ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపై రూ. లక్షకు మించి ఆర్జించిన పక్షంలో 10 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్‌లో జైట్లీ స్పష్టం చేశారు. ప్రస్తుతం సెక్యూరిటీల లావాదేవీల ద్వారా పన్ను(ఎస్‌టీటీ) ఆదాయం రూ. 9,000 కోట్లుమాత్రమే లభిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement