మార్కెట్ పంచాంగం
అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో....ఈ నెలలో పలుదఫాలు నిఫ్టీ 12,000 పాయింట్లపైకి వెళ్లినా, నిలదొక్కుకోలేకపోవడంతో అలసిపోయిన బుల్స్ ఆఫ్‌లోడింగ్ కారణంగా ఇండియా మార్కెట్ గరిష్టస్థాయి నుంచి 1 శాతం వరకూ తగ్గింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజి కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వాటి రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతుండగా, ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీసీఎస్‌లతో పాటు హెచ్డీఎఫ్సీ, ఐటీసీలు వాటి ఇటీవలి కనిష్టస్థాయిల వద్ద కదులుతున్నాయి. ఈ హెవీవెయిట్ల కదలికల్లో భారీ మార్పు వస్తేనే స్టాక్ సూచీలు ఎటో ఒకవైపు వేగంగా పయనించే అవకాశం వుంటుంది. సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి.....
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
నవంబర్ 22తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 40,222 కనిష్టస్థాయి నుంచి పెరిగి, 40,816 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఆ స్థాయిలో స్థిరపడలేక, వారాంతంలో దిగువకు జారిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 2 పాయింట్ల స్వల్ప లాభంతో 40,359 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాలుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న 40,000–40,800 శ్రేణిని ఛేదించే దిశ...సెన్సెక్స్ ట్రెండ్‌కు కీలకం. ఈ శ్రేణి దిగువస్థాయిని కోల్పోయి, ముగిస్తే సెన్సెక్స్ స్వల్పకాలిక కరెక్షన్కు లోనుకావొచ్చు. ఈ సందర్భంలో తొలుత 39,800 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. తరువాత 39,500 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. పైన ప్రస్తావించిన శ్రేణిలో ఈ వారం సెన్సెక్స్ కదలితే తొలుత 40,535 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపై ముగిస్తే క్రమేపీ 40,750–40,815 పాయింట్ల శ్రేణిని తిరిగి పరీక్షించవచ్చు.
నిఫ్టీకి 11,800–12,035 శ్రేణి కీలకం
గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,035 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని ఎదుర్కొని, గతవారం ప్రథమార్ధంలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోలేకపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 18 పాయింట్ల స్వల్పలాభంతో 11,914 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ నిఫ్టీ కదిలిన 11,800–12,035 శ్రేణి నుంచి వెలుపలికి వస్తేనే మార్కెట్లో ఆ దిశగా ట్రెండ్ వుండవచ్చు. ఈ వారం నిఫ్టీ 11,800 పాయింట్ల మద్దతును ముగింపులో కోల్పోతే 11,720 పాయింట్ల స్థాయికి, ఈ లోపున 11,650 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. లేదా గత మూడువారాల శ్రేణిలోనే నిఫ్టీ కదలికలు పరిమితమైతే తొలుత 11,960 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 12,030–12,040 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్టం 12,103 పాయింట్ల స్థాయిని దాటే అవకాశాలుంటాయి.
– పి. సత్యప్రసాద్
40,000–40,800 శ్రేణి కీలకం
Published Mon, Nov 25 2019 5:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement