ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

Published Thu, Feb 22 2018 4:06 PM

Sensex ends on a flat note - Sakshi

ముంబై : ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో వడ్డీ రేట్ల పెంపు అంచనాలు మార్కెట్లను దెబ్బతీశాయి. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుతో పాటు, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ కూడా రేట్ల పెంపు చేపట్టనుందని అంచనాలు వస్తుండటంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలలో కదలాడాయి. తొలుత 125 పాయింట్ల వరకూ పడిపోయిన సెన్సెక్స్‌ చివరికి కొంత కోలుకుని 25 పాయింట్ల నష్టంలో 33,819 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 15 పాయింట్ల నష్టంలో 10,400 మార్కు కింద 10,382 వద్ద క్లోజైంది.

డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 నెలల కనిష్టంలో 65ను తాకడంతో రెండో రోజు కూడా ఐటీ స్టాక్స్‌ లాభాల పంట పండించాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్‌ 0.5 శాతం పెరిగింది. నేటి ట్రేడింగ్‌లో సన్‌ ఫార్మా, అదానీ పోర్ట్స్‌, అరబిందో ఫార్మా టాప్‌ గెయినర్లుగా నిలువగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌ ఎక్కువగా నష్టపోయాయి.   

Advertisement

తప్పక చదవండి

Advertisement