నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Wed, May 3 2017 4:07 PM

Sensex ends on a negative note, Nifty manages to hold 9300

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 26.38 పాయింట్ల నష్టంలో 29,894.80 వద్ద ముగియగా.. నిఫ్టీ 1.85 పాయింట్ల నష్టంలో 9311.95వద్ద క్లోజైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. లుపిన్, టాటా మోటార్స్, అరబిందో ఫార్మా నష్టాల్లో ట్రేడయ్యాయి. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత నుంచి అస్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. మధ్యాహ్న సెషన్లోనూ ఊగిసలాటలోనే నడిచాయి.
 
ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ నాలుగో క్వార్టర్ ఫలితాలు, ఫెడరల్ రిజర్వు పాలసీపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించారు. దీంతో మార్కెట్లు నెగిటివ్ లో ముగిశాయి.  సెన్సెక్స్ ను ఎక్కువగా పడేసిన షేరులో ఐసీఐసీఐ బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు షేరు 1 శాతం కంటే పైగా పడిపోయింది. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 7 పైసలు బలపడి 64.14గా  ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు కూడా స్వల్పంగా 38 రూపాయలు పడిపోయి 28,544 వద్ద నమోదయ్యాయి. 
 

Advertisement
Advertisement