300 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

300 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌

Published Thu, Feb 8 2018 9:36 AM

Sensex gains 100 pts, Nifty reclaims 10,500 in opening - Sakshi

ముంబై : వరుసగా ఏడు సెషన్ల నుంచి 2000 పాయింట్లకు పైగా నష్టాలు పాలవుతూ వస్తున్న దేశీయ స్టాక్‌మార్కెట్లు, గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో కోలుకున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్ల మేర లాభపడగా... నిఫ్టీ 10,550 పైకి ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 300 పాయింట్ల లాభంలో 34,383 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభంలో 10,558 వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ స్టాక్స్‌ ర్యాలీతో స్టాక్‌మార్కెట్లు ఈ మేర ఎగిశాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో సిప్లా 5 శాతం మేర ర్యాలీ సాగించింది. టారో ఫలితాల అనంతరం సన్‌ ఫార్మా 2.6 శాతం, అరబిందో ఫార్మా 1 శాతం కిందకి పడిపోయాయి. అయితే నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 0.3 శాతం పాజిటివ్‌గా ప్రారంభమైంది.

సింగపూర్‌ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ ఫ్యూచర్స్‌  నుంచి బలమైన సంకేతాలు రావడంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా బలపడ్డాయి.  అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు బలహీనపడి 64.33గా ట్రేడవుతోంది. కాగ, గత ఏడు సెషన్ల నుంచి మార్కెట్లు తీవ్రంగా నష్టపోతూ వస్తున్నాయి. బడ్జెట్‌లో పన్ను ఎఫెక్ట్‌, అమెరికా స్టాక్‌ మార్కెట్ల పతనం, ఆర్‌బీఐ వడ్డీరేట్లపై నిర్ణయం ఇవన్నీ మార్కెట్లను ప్రభావితం చేస్తూ వచ్చాయి.  

Advertisement
Advertisement