లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Tue, Sep 22 2015 10:07 AM

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు


ముంబై:   మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం  ప్రారంభంలో వంద పాయింట్లకు పైగా లాభపడిన మార్కెట్లు ట్రేడర్లు లాభాల స్వీకరణతో  స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.  సెన్సెక్స్ 71 పాయింట్ల లాభంతో 26, 264 దగ్గర ట్రేడవుతోంది.  అలాగే  మార్నింగ్ లాభాలను స్వల్ప కోల్పోయిన నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 7,993 దగ్గర ట్రేడవుతోంది.

మరోవైపు  అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా    స్వల్పంగా మెరుగుపడింది.  17 పైసల లాభంతో 65.56   దగ్గర ఉంది.  కరెన్సీ మార్కెట్లో యూఎస్ డాలర్ విలువ క్షీణత  భారత కరెన్సీని ప్రభావితం చేస్తోంది.

 

Advertisement
Advertisement