జోరుగా మార్కెట్లు:300 పాయింట్లు జంప్‌ | Sakshi
Sakshi News home page

జోరుగా మార్కెట్లు:300 పాయింట్లు జంప్‌

Published Fri, Jun 29 2018 2:57 PM

 Sensex Jumps 300 points, RIL,Tata Steel Top Gainers - Sakshi

సాక్షి, ముంబై: గత రెండుమూడు రోజులుగా బలహీనంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు వారాంతంలోఉత్సాహంగా ట్రేడ్‌ అవుతున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా బలపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో  కీలక సూచీలు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 335 పాయింట్లు జంప్‌చేసి 35,371వద్ద, . నిఫ్టీ సైతం 104పాయింట్లు ఎగసి 10,693 వద్ద ట్రేడవుతోంది.  దాదాపు  అన్ని రంగాలూ లాభపడగా.. ఫార్మా మాత్రమే స్వల్ప వెనకడుగులో ఉంది. రియల్టీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ  షేర్లలో లాభాల జోరు కొనసాగుతోంది.

రిలయన్స్‌, టాటా  స్టీల్‌, గెయిల్‌, హిందాల్కో,  టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. హెచ్‌డీఐఎల్‌, ఒబెరాయ్‌, యూనిటెక్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బ్రిగేడ్‌ తదితర రియల్టీ షేర్లతో పాటు, వెల్‌స్పన్‌ కార్ప్‌, నాల్కో, హిందాల్కో, జిందాల్‌ స్టీల్‌, ఎన్‌ఎండీసీ, వేదాంతా, హింద్‌ కాపర్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా  మెటల్‌ షేర్లు లాభపడుతున్నాయి.  ఎల్‌ఐసీ డీల్‌ నేపథ్యంలో ఐడీబీఐ భారీగా లాడపడుతోంది.  ఇంకా ఓబీసీ, పీఎన్‌బీ, ఆంధ్రా, సిండికేట్‌, బీవోఐ, కెనరా, అలహాబాద్‌, యూనియన్‌ బ్యాంక్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ  ఎస్‌బీఐ లాంటి  పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్లు మద్దతులభిస్తోంది.   ఒరాకిల్‌, డా. రెడ్డీస్‌, హీరో మోటో,  టెక్‌మహీంద్ర,  హెచ్‌పీసీఎల్‌ నష్టపోతున్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement