వారాంతంలో లాభాల దౌడు: ట్రిపుల్‌ సెంచరీ | Sakshi
Sakshi News home page

వారాంతంలో లాభాల దౌడు: ట్రిపుల్‌ సెంచరీ

Published Fri, Jun 29 2018 3:45 PM

Sensex Jumps 386  points, Nifty Above 10,700 - Sakshi

సాక్షి, ముంబై: గతరెండు రోజులుగా బలహీనంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు  వారాంతంలో  భారీ లాభాల్లో  ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా బలపడ్డ సెంటిమెంటుతో లాభాలతో దూసుకుపోయిన కీలక  సూచీలు కూడా అదే జోరును ప్రదర్శించాయి.  సెన్సెక్స్‌ 386 పాయింట్లు జంప్‌చేసి 35,423వద్ద,  నిఫ్టీ 125 పాయింట్లు  పుంజుకుని 10,714 వద్ద ట్రేడవుతోంది.  తద్వారా నిఫ్టీ 10700కు పైన ముగిసింది.  దాదాపు  అన్ని రంగాలూ లాభపడగా.. ఫార్మా స్వల్పంగా నష్టపోయింది. రియల్టీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ  షేర్లలో   కొనుగోళ్ల వెల్లువ సాగింది.

రిలయన్స్‌, టాటా  స్టీల్‌, గెయిల్‌, హిందాల్కో,  టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. హెచ్‌డీఐఎల్‌, ఒబెరాయ్‌, యూనిటెక్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌, ఇండియాబుల్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బ్రిగేడ్‌ తదితర రియల్టీ షేర్లతో పాటు, వెల్‌స్పన్‌ కార్ప్‌, నాల్కో, హిందాల్కో, జిందాల్‌ స్టీల్‌, ఎన్‌ఎండీసీ, వేదాంతా, హింద్‌ కాపర్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా  మెటల్‌ షేర్లు లాభపడుతున్నాయి.  ఎల్‌ఐసీ డీల్‌ నేపథ్యంలో ఐడీబీఐ భారీగా లాడపడుతోంది.  ఇంకా ఓబీసీ, పీఎన్‌బీ, ఆంధ్రా, సిండికేట్‌, బీవోఐ, కెనరా, అలహాబాద్‌, యూనియన్‌ బ్యాంక్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పీఎన్‌బీ  ఎస్‌బీఐ లాంటి  పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్లు మద్దతులభిస్తోంది.   ఒరాకిల్‌, డా. రెడ్డీస్‌, హీరో మోటో,  టెక్‌మహీంద్ర,  హెచ్‌పీసీఎల్‌ నష్టపోతున్నాయి.
 

Advertisement
Advertisement