భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం | Sakshi
Sakshi News home page

భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

Published Mon, Aug 13 2018 9:39 AM

Sensex Loses 280 Points, Nifty At 11350 - Sakshi

ముంబై : గ్లోబల్‌గా వస్తున్న సంకేతాలు ప్రతికూలంగా ఉండటంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ఈ వారాన్ని ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 250 పాయింట్లకు పైగా పడిపోయింది. ప్రస్తుతం 245 పాయింట్ల నష్టంలో 37,624 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 68 పాయింట్ల నష్టంలో 11,361 వద్ద కొనసాగుతోంది. రూపాయి విలువ కూడా రికార్డు కనిష్ట స్థాయి 69.49కి పడిపోవడంతో, బ్యాంక్‌ షేర్లు తీవ్ర ఒత్తిడిలో మరలాయి. నిఫ్టీ సూచీలో టాప్‌ లూజర్లుగా వేదంత, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందాల్కో ఎక్కువగా 1.71 శాతం నుంచి 3.31 శాతం మధ్యలో నష్టపోయాయి. 

బుల్స్‌ తన జోరును కోల్పోయిందని, బేర్‌ తన ప్రతాపం చూపించిందని విశ్లేషకులు చెప్పారు. ఆసియన్‌ షేర్‌ మార్కెట్లు, యూరో దెబ్బతినడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆ ప్రభావం పడింది. టర్కీ కరెన్సీ సంక్షోభ ప్రభావాలు యూరప్‌నకు కూడా విస్తరించవచ్చన్న ఆందోళన నేపథ్యంలో యూరో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయింది. జపాన్‌ వెలుపల ట్రేడ్‌ అయ్యే ఆసియా పసిఫిక్‌ షేర్ల ఎంఎస్‌సీఐ బ్రాడెస్ట్‌ ఇండెక్స్‌ కూడా 1.3 శాతం నష్టంలో ఐదు వారాల కనిష్ట స్థాయికి క్షీణించింది. దీంతో కమోడిటీ మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ పెరిగింది. 

Advertisement
Advertisement