6వ రోజూ లాభాలే | Sakshi
Sakshi News home page

6వ రోజూ లాభాలే

Published Tue, Aug 19 2014 11:18 PM

6వ రోజూ లాభాలే - Sakshi

 గత వారం రోజులుగా బలపడ్డ సెంటిమెంట్‌ను ప్రతిబింబిస్తూ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ మరో 30 పాయింట్లు పెరిగి 26,421 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 23 పాయింట్లు పుంజుకుని 7,897 వద్ద నిలిచింది. ఇవి కొత్త రికార్డు ముగింపులుకాగా, ఇంట్రాడేలో నిఫ్టీ 7,918ను అధిగమించింది. సెన్సెక్స్ సైతం 26,531కు చేరడం విశేషం! విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, 14 నెలల కనిష్టానికి చేరిన చమురు ధరలు, విదేశీ సానుకూల సంకేతాలు వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలిపారు.

 ఆరు రోజుల్లో సెన్సెక్స్ 1,090 పాయింట్లు జమ చేసుకుంది. బీఎస్‌ఈలో ఆటో రంగం అత్యధికంగా 2.2% పుంజుకుంది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1%పైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,693 లాభపడగా, 1,266 నష్టపోయాయి.   
 
 ఫండ్ హౌస్‌లలో అగ్రస్థానాలు ఆ కంపెనీలవే...
 ముంబై: ఫండ్ హౌస్‌లలో తొలి మూడు అగ్రస్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్‌లు గత మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘వెల్త్ ఫోరమ్’ 3వ వార్షిక సర్వే ఈ విషయం తెలిపింది. సర్వేలో 42 నగరాల్లోని ‘ఇండిపెండెంట్  ఫైనాన్షియర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement