ఆరవరోజూ లాభాలే: 10900కి ఎగువన నిఫ్టీ | Sakshi
Sakshi News home page

ఆరవరోజూ లాభాలే: 10900కి ఎగువన నిఫ్టీ

Published Tue, Dec 18 2018 4:37 PM

Sensex, Nifty Close Higher For Sixth Session In A Row - Sakshi

సాక్షి, ముంబై: అమెరికా సహా ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ దేశీయ స్టాక్‌మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. ఆరంభంలో 200పాయింట్లు నష్టపోయినా మిడ్‌సెషన్‌ నుంచి బాగా కోలుకున్నాయి. చివరి గంటలో పుంజుకున్నకొనుగోళ్లతో వరుసగా ఆరవరోజు కూడా కీలక సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 77 పాయింట్లు ఎగిసి 36,347 వద్ద , నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 10,909 వద్ద ముగిశాయి.  ప్రధానంగా నిప్టీ 10900కి ఎగువకు చేరింది.   నిఫ్టీకి అక్టోబర్‌ 1 తరువాత ఇదే హయ్యస్ట్‌ క్లోజింగ్‌.

ఒక్క మీడియా, ఐటీ  తప్ప దాదాపు అన్ని రంగాలులాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో మెటల్‌, ఫార్మా,  1.5-0.7 శాతం మధ్య ఎగశాయి. మీడియా 4 శాతం,  ఐటీ సైతం 1 శాతం నస్టపోయాయి. సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, వేదాంతా, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3-1.4 శాతం లాభపడ్డాయి. మరోవైపు   ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టాప్‌ లూజర్స్‌గా నమోదయ్యాయి.  వీటితోపాటు యూపీఎల్‌,టెక్ మహీంద్రా, విప్రో, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, ఓఎన్‌జీసీ, ఐబీ హౌసింగ్‌ నష్టాల్లో ముగిశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement