ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Aug 21 2018 3:53 PM

Sensex, Nifty End Flat - Sakshi

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రారంభంలో రికార్డు స్థాయిల్లోకి ఎగిసిన మార్కెట్లు, చివరికి అన్ని లాభాలను పోగొట్టుకున్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు స్వల్పంగానే లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 7 పాయింట్ల లాభంలో 38,285 వద్ద, నిఫ్టీ 19 పాయింట్ల లాభంలో 11,570 వద్ద క్లోజయ్యాయి. రికార్డు స్థాయిల వద్ద మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుందని, ముఖ్యంగా బ్యాంక్‌ల్లో ఎక్కువగా అమ్మకాలు జరిగినట్టు మార్కెట్‌ విశ్లేషకులు చెప్పారు. మెటల్స్‌, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా బలహీనపడ్డట్టు పేర్కొన్నారు.

ఐటీ, ఫార్మాస్యూటికల్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి క్షీణత ఐటీ స్టాక్స్‌ బలపడటానికి దోహదం చేసింది. స్వల్ప లాభాలతోనే మిడ్‌క్యాప్‌ సూచీలు కూడా ముగిశాయి. టాప్‌ గెయినర్లుగా కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, టెక్‌ మహింద్రాలు నిలువగా.. టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, బీపీసీఎల్‌లు ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసల నష్టంలో 69.84గా నమోదవుతుంది. 

Advertisement
Advertisement