నష్టాల్లో ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Published Tue, Nov 14 2017 3:35 PM

Sensex, Nifty ends lower - Sakshi

ముంబై : కన్సాలిడేషన్‌ బాటలో సాగిన స్టాక్‌ మార్కెట్లు ట్రేడింగ్‌ చివరి నాటికి మరింత కిందకి పడిపోయాయి. రోజు మొత్తం స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది.సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా నష్టాలు పాలైంది. చివరికి 91.69 పాయింట్ల నష్టంలో 33వేల మార్కు కింద 32,941 వద్ద క్లోజైంది. నిఫ్టీ కూడా 38.35 పాయింట్ల నష్టంలో 10,186 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌, ఐటీ 0.6 శాతం చొప్పున బలహీనపడగా.. రియల్టీ 0.5 శాతం, ఆటో 0.2 శాతం చొప్పున పుంజుకున్నాయి. 

నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌పీసీఎల్‌, వేదాంతా, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, ఇండస్‌ఇండ్‌ 5-1.65 శాతం మధ్య పతనమయ్యాయి. అయితే మరోపక్క హీరోమోటో, యాక్సిస్‌, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, లుపిన్‌, కొటక్‌ బ్యాంక్‌ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement