మార్కెట్లు సరికొత్త రికార్డుల మోత | Sakshi
Sakshi News home page

మార్కెట్లు సరికొత్త రికార్డుల మోత

Published Mon, Jan 8 2018 3:50 PM

Sensex, Nifty, Midcap at fresh record close - Sakshi

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డుల మోత మోగించాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త రికార్డు గరిష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ తొలిసారి 10,600కి పైన 10,623 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌ కూడా 199 పాయింట్ల లాభంలో 34,352 వద్ద స్థిరపడింది.  ఇన్ఫోసిస్‌, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీలు మార్కెట్లకు మంచి లాభాలను అందించాయి.  డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు, షేర్‌ బైబ్యాక్‌ ఆమోదంతో యూనికెమ్‌ ల్యాబోరేటరీస్‌ సరికొత్త గరిష్టాల్లోకి  ఎగిసింది. ఈ కంపెనీ షేరు సుమారు 9 శాతం మేర పెరిగింది.

అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు బుల్‌ర్యాలీలో కొనసాగుతుండటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నట్లు నిపుణులు చెప్పారు. అమెరికా స్టాక్‌ ఇండెక్సులు డోజొన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సైతం రికార్డుల ర్యాలీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్ఈలో ఫార్మా, ఐటీ రంగాలు 1.25 శాతం స్థాయిలో పుంజుకోగా.. ప్రభుత్వ బ్యాంక్స్‌ నష్టాల్లో నడిచాయి. రియల్టీ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ దాదాపు 1 శాతం చొప్పున బలపడ్డాయి. టాప్‌ గెయినర్లుగా కోల్‌ ఇండియా, లుపిన్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ లాభాలు పండించగా.. భారతీ, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌ నష్టాలు గడించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement