వాణిజ్య ఆందోళనలు : మార్కెట్లు ఫ్లాట్‌ | Sakshi
Sakshi News home page

వాణిజ్య ఆందోళనలు : మార్కెట్లు ఫ్లాట్‌

Published Wed, Jul 4 2018 9:31 AM

Sensex, Nifty, Midcap Indices Open Flat - Sakshi

ముంబై : అంతర్జాతీయంగా వాణిజ్య ఆందోళనలు కొనసాగుతుండటంతో, ఆసియన్‌ మార్కెట్ల నుంచి బలహీనమైన సంకేతాలు వీస్తున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌, నిఫ్టీతో పాటు మిడ్‌క్యాప్‌ సూచీ కూడా ఫ్లాట్‌గానే ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 17 పాయింట్ల లాభంలో 35,395 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల లాభంలో 10,705 వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు జూన్‌ క్వార్టర్‌ ఫలితాల సీజన్‌ కూడా వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోతుంది.  

ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, టాటా స్టీల్‌, టైటాన్‌ కంపెనీ, సిప్లా, లుపిన్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాలు పండించాయి. వేదంత, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌లు ఒత్తిడిలో కొనసాగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 68.52 వద్ద ప్రారంభమైంది.

Advertisement
Advertisement