నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

Published Thu, Jun 28 2018 9:57 AM

Sensex Opens Mildly Lower, Nifty Below 10650 - Sakshi

ముంబై : డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌ ముగింపు నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. సెన్సెక్స్‌ 67 పాయింట్ల నష్టంలో 35,150 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంలో 10,637 వద్ద ట్రేడవుతున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, చమురు సెగతో బుధవారం ట్రేడింగ్‌లో కూడా మార్కెట్లు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ వారమంతా మార్కెట్లు ప్రతికూలంగానే ట్రేడవుతూ వస్తున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావంతో మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయని విశ్లేషకులు అన్నారు. మరోవైపు చమురు సెగ కూడా మార్కెట్లకు తగులుతుందని చెప్పారు. అటు మిడ్‌క్యాప్‌ షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మొట్టమొదటిసారి 69 స్థాయికి పడిపోయింది. ఇదే ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయి. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement