ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌గా స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

Published Tue, Nov 28 2017 9:27 AM

Sensex opens nearly flat, Nifty down 12 points at 10,387.90 - Sakshi - Sakshi - Sakshi

ముంబై : ప్రాఫిట్‌ బుకింగ్‌తో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 25.72 పాయింట్లు నష్టపోతూ 33,698.72 వద్ద, నిఫ్టీ 9.60 పాయింట్ల నష్టంలో 10,389.95 వద్ద ఒడిదుడుకులుగా ట్రేడవుతున్నాయి. ఆర్‌కామ్‌ 8 శాతం పడిపోగా.. పీఎన్‌సీఇన్‌ఫ్రా 4 శాతం పైకి పెరిగింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఐఓసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్‌, టెక్‌ మహింద్రా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌లు నష్టాలు గడించాయి.

టాటా పవర్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, అంబుజా సిమెంట్స్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభాలార్జించాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసల లాభంలో 64.58గా ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 120 రూపాయల లాభంలో రూ.29,500గా నమోదవుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement