20 నెలల కనిష్టానికి సెన్సెక్స్ | Sakshi
Sakshi News home page

20 నెలల కనిష్టానికి సెన్సెక్స్

Published Tue, Jan 19 2016 2:16 AM

20 నెలల కనిష్టానికి సెన్సెక్స్

267 పాయింట్ల నష్టంతో 24,188కు డౌన్ 
  క్రూడ్, రిలయన్స్ ఎఫెక్ట్
 ఈ వారం స్టాక్ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. ఎగుమతులు భారీగా క్షీణించడం, ముడి చమురు ధరలు కొత్త కనిష్ట స్థాయిలకు చేరడం, క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండ డంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.    బీఎస్‌ఈ సెన్సెక్స్ 267 పాయింట్లు నష్టపోయి 24,188 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 87 పాయింటు నష్టపోయి 7,351 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 20 నెలల కనిష్ట స్థాయి.  రూపాయి క్షీణత, చైనా ఆర్థిక పరిస్థితిపై ఆందోళన, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి.

 రిలయన్స్ 5 శాతం డౌన్
 నేడు (మంగళవారం) ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపధ్యంలో ఈ నెల 4 నుంచి 8% ఎగసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఈ షేర్  5.14 శాతం నష్టపోయి రూ.1,018 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో బాగా నష్టపోయిన షేర్ ఇదే.  ఈ ఒక్కరోజే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.17,779 కోట్లు హరించుకుపోయింది. చమురు దిగుమతుల భారీగా పతనం కావడంతో నైజీరియా కరెన్సీ బలహీనపడింది. దీంతో ఈ ఆదేశంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న బజాజ్ ఆటో 3.6శాతం నష్టపోయింది
.
 జీవీఆర్ ఇన్‌ఫ్రా ఐపీఓకు సెబీ అనుమతి
 నిర్మాణ రంగ కంపెనీ జీవీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా కనీసం రూ.400 కోట్లు సమీకరించాలని చెన్నైకి చెందిన జీవీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ యోచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement