నష్టాల్లో ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Published Thu, Jun 28 2018 4:16 PM

Sensex Sheds 179 Points, Nifty Closes Below 10,600 - Sakshi

సాక్షి,ముంబై: దేశాయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో  ముగిశాయి. ఆరంభంనుంచి   ఒడిదుడుకుల మధ్య కొనసాగినసూచీలు చివరకు నష్టాలతోనే ముగిశాయి.  తీవ్ర అమ్మకాలతో  ఒక దశలో సెన్సెక్స్‌ 270పాయింట్లు పైగా పతనమై 35 వేల దిగువకు  చేరింది. చివకు సెన్సెక్స్‌ 179 పాయింట్లు క్షీణించి 35,028 వద్ద, నిఫ్టీ 82 పాయింట్లు నష‍్టపోయి 10589వద్ద  స్థిరపడింది.  తద్వారా నిఫ్టీ 10600 దిగువకు చేరింది.  ఒక్క మెటల్‌ తప్ప దాదాపు అన్ని రంగాలూ  వెనకడుగు వేశాయి. ప్రధానంగా  రియల్టీ, బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, ఆయిల్‌సెక్టార్‌ నష్టాలు మార్కెట్లను  నష్టాల్లోకి నెట్టాయి.  ట్రేడ్‌వార్‌  భయాలు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను దెబ్బతీయడంతో దేశీయంగాను ప్రభావం చూపిందని ఎనలిస్టుల విశ్లేషణ.

టెక్‌ మహీంద్ర 7శాతానికి పైగా నష్టపోగా, బీపీసీఎల్‌, పీఎన్‌బీ, అశోక్‌ లేలాండ్‌, ప్రెస్టేజ్‌, ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, శోభా, ఒబెరాయ్‌, హెచ్‌డీఐఎల్‌, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, యూనిటెక్‌,  తదితరాలు నష్టాల్లో ముగిశాయి.   మరోవైపు  మదర్సన్‌ సుమీ, టాటా స్టీల్‌ , ఎంఅండ్ఎం‌, గోద్రెజ్‌, నాల్కో,  హిందాల్కో, భారత్‌ ఫోర్జ్‌, కంకార్‌, టొరంట్‌ పవర్‌, న్ఫోసిస్‌, గోద్రెజ్‌ సీపీ, టాటా పవర్‌  టాప్‌విన్నర్స్‌గా నిలిచాయి. అటు  ఎంసీఎక్స్‌ మార్కెట్లో పుత్తడి 100 రూపాయిలు క్షీణించి 10 గ్రా. 30,595 వద్ద ఉంది.   
 

Advertisement
Advertisement