బుల్‌ రన్‌కు బ్రేక్‌..రికార్డ్‌ హైకి ఎగువనే | Sakshi
Sakshi News home page

బుల్‌ రన్‌కు బ్రేక్‌..రికార్డ్‌ హైకి ఎగువనే

Published Fri, Jul 14 2017 3:38 PM

బుల్‌ రన్‌కు బ్రేక్‌..రికార్డ్‌ హైకి ఎగువనే

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఆరంభం నుంచి ఒడిదుడుకుల మధ్య సాగిన మార్కెట్లలో నాలుగు రోజుల  రికార్డ్‌ బ్రేకింగ్‌  బుల్‌ రన్‌కు బ్రేక్‌ పడింది.  లాభాల  స్వీకరణ కారణంగా మిడ్‌ సెషన్‌ తర్వాత సెన్సెక్స్‌ ఒకదశలో 100 పాయింట్లకు పైగా  నష్టపోయింది. ముఖ్యంగా ఈ రోజు మొదటిసారి  చారిత్రాత్మక 9900 స్థాయిని తాకిన నిఫ్టీ అనంతరం వెనకడుగువేసింది.  కానీ చివరల్లో  భారీగా పుంజుకుని సెన్సెక్స్‌ 17 పాయింట్లు  కోల్పోయి 32030 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9886 వద్ద  స్థిరపడ్డాయి.  అయితే వారాంతంలో  ప్రధాన సూచీలు  రెండూ సాంకేతికంగా మద్దతు స్థాయిలకుపైనే ముగియడం విశేషం.

 ఇంట్రా డే ట్రేడింగ్‌ లో , ప్రభుత్వం రంగ బ్యాంకులు, ఫార్మా పుంజుకోగా, ఐటీ బలహీనపడింది. బయోకాన్‌, అరబిందో (6శాతం), లుపిన్‌,   ట్రెంట్‌,  గెయిల్‌, సిప్లా ఏసీసీ, కోటక్‌ బ్యాంక్‌,  టాప్‌ గెయినర్స్‌గా ఉండగా,   ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌,ఐవోసీ, విప్రో, టాటా మెటార్స్‌,  ఎస్‌బ్యాంక్‌,  నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement