ఒడిదుడుకుల్లో మార్కెట్లు | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల్లో మార్కెట్లు

Published Tue, May 24 2016 10:55 AM

Sensex starts on a cautious note; M&M, TCS, Infosys top losers

ముంబై : వరుసగా నాలుగురోజుల నుంచి నష్టాల పాలవుతూ వస్తున్న స్టాక్ మార్కెట్లు నేటి(మంగళవారం)ట్రేడింగ్ లో కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ కేవలం 1 పాయింట్ల లాభంతో 25,232 వద్ద, నిఫ్టీ 1 పాయింట్ల లాభంతో 7,732వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్టీపీసీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగుతుండగా...ఇన్ఫోసిస్, ఎమ్ అండ్ ఎమ్, సన్ ఫార్మా, టీసీఎస్ లు బలహీనంగా నమోదవుతున్నాయి. నిఫ్టీలో మేజర్ ఇండెక్స్ లుగా ఉన్న ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, వినియోగదారుల వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ నష్టాలను నమోదుచేస్తున్నాయి.

భారత్ లో లభ్యమయ్యే బ్రెడ్ లో కెమికల్ శాతాలు ఎక్కువగా ఉన్నాయని, వాటివల్ల బ్రెడ్ తో తయారీ చేసే జంక్ ఫుడ్, బర్గర్లను  తినడం వల్ల థైరాయిడ్, క్యాన్సర్ లకు దారితీయవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ హెచ్చరికలు జారిచేసింది. దీంతో ప్రముఖ ఆహార దిగ్గజ షేర్లు పడిపోతున్నాయి. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు 8 శాతం, బ్రిటానియా షేర్లు 1 శాతం పడిపోతున్నాయి. కేఎఫ్ సీ, పిజ్జా హట్, డామినోస్, సబ్ వే, మెక్ డొనాల్డ్స్, స్లైస్ ఆఫ్ ఇటలీ ఆఫర్ చేసే ఆహార ఉత్పత్తులో కూడా ఎక్కువ కెమికల్స్ ఉంటున్నాయని సీఎస్ఈ రిపోర్టు విడుదల చేసింది. దీంతో డామినోస్ పిజ్జా, డన్ కిన్ డొనట్స్ షేర్లు నేటి ఇంట్రా డ్రేట్ లో 12.35శాతం పతనమయ్యాయి. అయితే తాము ఆఫర్ చేసే బ్రెడ్ ఉత్పత్తుల్లో అన్ని పదార్థాలు తగిన మోతాదుల్లో ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అనుమతులు ఇచ్చిందని బ్రిటానియా, జూబ్లియంట్ చెబుతున్నాయి. ఆహారభద్రత నిబంధనలను పాటిస్తున్నామని పేర్కొంటున్నాయి.

మరోవైపు రూపాయి విలువ కూడా రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ మారకం విలువతో పోల్చుకుంటే రూపాయి 14 పైసలు నష్టపోయి 67.63గా కొనసాగుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వు నుంచి తర్వాత వచ్చే సంకేతాల కోసం పెట్టుబడిదారులు వేచిచూస్తూ ఆసియన్ మార్కెట్లో ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఆసియన్ మార్కెట్లు కూడా నష్టాలు పాలవుతున్నాయి.  పసిడి, వెండి ధరలు సైతం నష్టాలే పాలవుతున్నాయి. పసిడి రూ.69 నష్టంతో రూ.29,615 వద్ద, వెండి రూ.190నష్టంతో రూ.39,475వద్ద ట్రేడ్ అవుతోంది.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement