గ్లో‘బుల్’ ర్యాలీ..! | Sakshi
Sakshi News home page

గ్లో‘బుల్’ ర్యాలీ..!

Published Fri, Dec 9 2016 12:18 AM

గ్లో‘బుల్’ ర్యాలీ..!

సెన్సెక్స్ 457 పాయింట్లు జూమ్
జోష్‌నిచ్చిన అంతర్జాతీయ సంకేతాలు
సానుకూల ప్రభావం చూపిన ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్ తొలగింపు
ఇంట్రాడేలో 500 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్... 26,694 వద్ద ముగింపు
145 పారుుంట్ల లాభపడి 8,247కు నిఫ్టీ  
అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే

సానుకూల అంతర్జాతీయ సంకేతాల దన్నుతో స్టాక్ సూచీలు గురువారం దూసుకుపోయారుు. రూపారుు 28 పైసలు బలపడడం, ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్‌ను ఆర్‌బీఐ తొలగించడం, షార్ట్ కవరింగ్  తదితర అంశాల కారణంగా స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 8,200 పారుుంట్లపైకి ఎగబాకింది. సెన్సెక్స్ 457 పారుుంట్లు (1.74 శాతం) లాభపడి 26,694 పారుుంట్ల వద్ద, నిఫ్టీ 145 పారుుంట్లు లాభపడి 8,247 పారుుంట్ల వద్ద ముగిశారుు. ఆరు వారాల్లో సెన్సెక్స్ ఒక్క రోజులో ఇన్ని పారుుంట్లు పెరగడం ఇదే మొదటిసారి. ముగింపులో ఇది దాదాపు నెల రోజుల గరిష్టం.

రోజంతా లాభాల్లోనే...
లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే సాగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 500 పారుుంట్లు లాభపడగా, నిఫ్టీ కీలకమైన 8,250 పారుుంట్లను తాకింది. లోహ, వాహన, మౌలిక, టెక్నాలజీ, బ్యాంక్ తదితర పలు రంగాల షేర్లు  లాభాల్లో ముగిశారుు. అన్ని రంగాల సూచీలు 1% పైగా ఎగిశారుు. లోహ సూచీ 3%కి పైగా లాభపడింది.

 షార్ట్ కవరింగ్...
సీఆర్‌ఆర్ విషయమై ఆర్‌బీఐ సానుకూలమైన నిర్ణయం తీసుకోవడం, ఈసీబీ ప్యాకేజీని కొనసాగిస్తుందన్న అంచనాలు మార్కెట్‌కు తోడ్పాటునందించాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. సమీప కాలంలో ఈ జోరు కొనసాగకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇతర వర్థమాన దేశాలతో పోల్చితే భారత మార్కెట్ తక్కువగా పెరిగిందని పేర్కొన్నారు. అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ రేట్లు తగ్గించకపోవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టపోరుుందని, ఆ సందర్భంగా ఇన్వెస్టర్లు తీసుకున్న షార్ట్ పొజిషన్లను తాజాగా కవర్ చేసుకోవడంతో మార్కెట్ పెరిగిందని ఆయన వివరించారు.

 మార్కెట్ ముఖ్యాంశాలు:
సీఆర్‌ఆర్ విషయమై ఆర్‌బీఐ సానుకూల నిర్ణయం కారణంగా బ్యాంక్ షేర్లు లాభపడ్డారుు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్  బ్యాంక్‌లు 2 శాతం వరకూ లాభపడ్డారుు.

టాటా స్టీల్ 5 శాతం అప్.. ఇంగ్లాండ్లో వంద కోట్ల  పౌండ్ల పెట్టుబడులు పెట్టనున్నామని టాటా స్టీల్ ప్రకటించడంతో ఈ షేర్ 4.6 శాతం లాభపడి రూ.432 వద్ద ముగిసింది.

గత కొన్ని రోజులగా ఉన్న లోహ షేర్ల జోరు కొనసాగింది. వేదాంత ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థారుు రూ.245ను తాకింది. చివరకు లాభంతో రూ.243 వద్ద ముగిసింది. హిందాల్కో, సెరుుల్, ఎన్‌ఎండీసీ, జేఎస్‌పీఎల్ షేర్లు లాభపడ్డారుు.

టాటా మోటార్స్, అదానీ పోర్‌‌ట్స, హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, ఐటీసీ, రిలయన్‌‌స, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, టీసీఎస్, మారుతీ సుజుకీ, బజాజ్ ఆటో షేర్లు  2.5 శాతం రేంజ్‌లో పెరిగారుు.

ఒక్క ఎన్‌టీపీసీ తప్ప మిగిలిన ఆన్ని సెన్సెక్స్ షేర్లు లాభపడ్డారుు.

51 షేర్ల నిఫ్టీ ఫిఫ్టీలో నాలుగు షేర్లు మినహా అన్ని షేర్లూ పెరిగారుు. భారతీ ఇన్‌ఫ్రా, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఎన్‌టీపీసీ షేర్లు 2 శాతం వరకూ పడిపోయారుు.

బీఎస్‌ఈలో 1,827 షేర్లు లాభాల్లో, 814 షేర్లు నష్టాల్లో ముగిశారుు.

{పస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఎరువుల షేర్లు 11 శాతం వరకూ లాభపడ్డారుు. చంబల్  ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, మద్రాస్ ఫెర్టిలైజర్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఫ్యాక్ట్, దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ షేర్లు 3-11 శాతం రేంజ్‌లో పెరిగారుు.

ఈ జోరు ఎందుకంటే...
సానుకూల అంతర్జాతీయ సంకేతాలు...
బుధవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో గురువారం ఆసియా మార్కెట్లు కూడా లాభపడ్డారుు.
గురువారం నాటి ఈసీబీ సమావేశంలో బాండ్ల కొనుగోళ్ల కార్యక్రమాన్ని మరో ఆరు నెలల పాటు కొనసాగించే అవకాశాలున్నాయన్న అంచనాలు నెలకొన్నారుు. ఈ కారణంగా యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యారుు. ఇది మన మార్కెట్‌కు మరింత జోష్‌నిచ్చింది.

ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్ తొలగింపు: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో ఇటీవల విధించిన ఇంక్రిమెంటల్ సీఆర్‌ఆర్(100%)ను   తొలగించాలని ఆర్‌బీఐ నిర్ణయం సానుకూల ప్రభావం చూపింది.

రూపారుు బలపడడం: గత నెల 23న 68.86 కనిష్ట స్థారుుని తాకిన రూపారుు గురువారం 27 పైసలు బలపడి 67.36 వద్ద ముగిసింది. ఇది దాదాపు నెల గరిష్ట స్థారుు. రూపారుుతో పాటు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కూడా బలపడింది.

విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు: డాలర్ బలపడుతుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో ఇటీవల వరకూ అమ్మకాలు సాగించిన విదేశీ ఇన్వెస్టర్లు గత రెండు ట్రేడింగ్ సెషన్లలో రూ.356 కోట్ల వరకూ కొనుగోళ్లు జరిపారు.

ఆకర్షణీయంగా షేర్ల ధరలు: ఇటీవల పతనం కారణంగా పలు షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడంతో కొనుగోళ్లు జోరందుకున్నారుు.

షార్ట్ కవరింగ్: బ్యాంకుల్లో డిపాజిట్లు బాగా పెరగడంతో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు నెలకొన్నారుు. ఈ అంచనాలకు భిన్నంగా రేట్ల విషయమై యధాతథ స్థితిని ఆర్‌బీఐ కొనసాగించడంతో బుధవారం పలు బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు పడిపోయారుు. దీంతో ఆ షేర్లలో గురువారం షార్ట్ కవరింగ్ జరిగింది.

Advertisement
Advertisement