చివరికి లాభాలన్నీ పోయాయి.. | Sakshi
Sakshi News home page

చివరికి లాభాలన్నీ పోయాయి..

Published Wed, Sep 13 2017 3:59 PM

Sensex trims most gains, Nifty ends the session in red; midcaps crack

సాక్షి, ముంబై : దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధుల ప్రవాహం పెరగడంతో దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు, చివరికి తమ లాభాలన్నింటిన్నీ కోల్పోయాయి. ఇంట్రాడే గరిష్ట మార్కులను తాకిన నిఫ్టీ 13.75 పాయింట్ల నష్టంలో 10,079 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ సైతం కేవలం 27.75 పాయింట్ల లాభంలో 32,186 వద్ద క్లోజైంది. అన్ని సెక్టార్‌లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు ఉదయం నుంచి లాభాల్లో ట్రేడయ్యాయి. కానీ చివరి గంటల్లో జరిగిన ట్రేడింగ్‌లో మాత్రం మార్కెట్లు తన లాభాలన్నింటిన్నీ కోల్పోయాయి. అయినప్పటికీ నిఫ్టీ 10.050 మార్కుకు పైననే ముగిసింది.
 
నిఫ్టీ ఇంట్రాడేలో 10,131 గరిష్ట మార్కును తాకింది. ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు మార్కెట్లను పడగొట్టాయి. మిడ్‌క్యాప్స్‌ కొంత కరెక్షన్‌కు గురయ్యాయి. ఫార్మా, ఎనర్జీ సూచీలు కూడా ఫ్లాట్‌గా ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు కూడా అస్థిరంగానే నమోదయ్యాయి. రెండు సూచీల్లోనూ సన్‌ ఫార్మాస్యూటికల్స్‌, రిలయన్స్‌, టాటా పవర్‌, సన్‌ఫార్మా లాభాలు పండించగా.. ఐటీసీ, సిప్లా, బీపీసీఎల్‌, ఐఓసీ నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి 63.99గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 72 రూపాయల లాభంలో రూ.30,015గా ఉన్నాయి.  

Advertisement
Advertisement