మూడు వారాల గరిష్ట స్థాయికి సెన్సెక్స్ | Sakshi
Sakshi News home page

మూడు వారాల గరిష్ట స్థాయికి సెన్సెక్స్

Published Thu, Sep 5 2013 5:03 PM

మూడు వారాల గరిష్ట స్థాయికి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ నేడు భారీ లాభాలతో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి బలపడడంతో మార్కెట్ సానుకూలంగా ముగిసింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ మూడు వారాల గరిష్ట స్థాయికి చేరింది. మరోవైపు రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన రఘురామ్ రాజన్‌పై పెరిగిన అంచనాలు సెంటిమెంట్‌కు ప్రోత్సాహాన్నిచ్చాయి. వరుసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగడంతో ఇన్వెస్టర్ల పంట పండింది.

బ్యాంకులు, రియాల్టీ, కన్జుమర్ డ్యురబుల్, పీఎస్యూ షేర్ల ర్యాలీతో మదుపుదారులు రూ. 1.2 లక్షల కోట్లు ఆర్జించారు. సెన్సెక్స్ 412 పాయింట్లు పెరిగి 18,979 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్లు ఎగసి 5,592 వద్ద స్థిరపడింది. పెన్షర్ల బిల్లును లోక్సభ ఆమోదించడంతో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడుతుందన్న విశ్వాసంతో మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపారని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకింగ్ ఇండెక్స్ 9.30 శాతం పెరిగింది.
 

Advertisement
Advertisement