లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Sat, Feb 28 2015 9:31 AM

Sensex up over 200 pts; SBI, BHEL gainers

ముంబయి : సాధారణ బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు శనివారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్ 200, నిఫ్టీ 70 పాయింట్ల లాభాలతో ఆరంభం అయ్యాయి.  కాగా భారత స్టాక్ మార్కెట్లకు ప్రతి శని, ఆదివారాలు సెలవులు. అయితే  కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ  ఈరోజు లోక్ సభలో  ప్రవేశపెడుతున్నారు. ప్రతిసారీ కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 28నే ప్రవేశపెడుతుంటారు. అయితే అది ఈసారి శనివారం రావడంతో.. బ్రోకర్ల విజ్ఞప్తి మేరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండింటినీ తెరిచి ఉంచారు.  దాంతో  సంప్రదాయానికి భిన్నంగా నేడు స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ కొనసాగుతోంది.

మరోవైపు ప్రభుత్వం ప్రకటించే నిర్ణయాలను బట్టి ఆయా రంగాలకు చెందిన షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు రావడం సర్వ సాధారణం. ఏయే రంగాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలుంటాయన్న అంచనాలతో ముందునుంచి షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. అంచనాలకు అనుగుణంగా ఉంటే సెన్సెక్స్ ఒక్కసారిగా రయ్యిమని పెరగడం, పరిశ్రమకు అనుకూలంగా లేకపోతే ధడేల్మని పడిపోవడం కూడా ఎప్పుడూ చూస్తుంటాం.

Advertisement
Advertisement