Sakshi News home page

నష్టాల్లో సూచీలు: ఇండిగోకు ఫలితాల దెబ్బ

Published Thu, May 3 2018 9:41 AM

Sensex,Nifty   Edges Lower, IndiGo Shares Slump 7Percent  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో  ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం అమ్మకాల  ఒత్తిడి  నేపథ్యంలో   సెన్సెక్స్‌ 66పాయింట్లు నష్టపోయి 35,  110  వద్ద,నిఫ్టీ 29పాయింట్లు కోల్పోయి 10689 వద్ద కొనసాగుతున్నాయి.  దీంతో ప్రధానంగా నిఫ్టీ 10700 స్థాయి  దిగువకు చేరింది.  దాదాపు అన్ని సెక్టార్లు ఫ్లాట్‌గానే ఉన్నాయి. మెటల్‌, మీడియా మాత్రం స్వల్పంగా లాభపడుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో హెచ్‌సీఎల్‌ టెక్‌ విప్రో, సిప్లా, ఐబీ హౌసింగ్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, యస్‌బ్యాంక్‌, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా నష్టపోతుండగా,  ఇన్‌ఫ్రాటెల్‌, జీ, హిందాల్కో, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ, గ్రాసిమ్‌, వేదాంతా, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ  లాభపడుతున్నాయి. మరోవైపు  ఫలితాల దెబ్బతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌  భారీగా 7శాతానికి పైగా నష్టపోతోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement