‘షేర్లపై ఆన్‌లైన్లో రుణం’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్కీమ్ | Sakshi
Sakshi News home page

‘షేర్లపై ఆన్‌లైన్లో రుణం’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్కీమ్

Published Mon, Sep 21 2015 1:51 AM

‘షేర్లపై ఆన్‌లైన్లో రుణం’ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్కీమ్ - Sakshi

‘డిజైన్ యువర్ ఓన్ లోన్’ పేరిట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కస్టమర్లు  తమ డీమ్యాట్ అకౌంట్‌లోని షేర్లపై ఆన్‌లైన్‌లో రుణం పొందవచ్చు. రుణం కోసం ఏయే షేర్లను ఎంత మేర తనఖా పెట్టదల్చుకున్నారో పరిమితులు కూడా స్వయంగా నిర్దేశించవచ్చు. కనిష్టంగా రూ. 1 లక్ష.. గరిష్టంగా రూ. 20 లక్షల రుణం పొందవచ్చు. కస్టమర్లు ప్రత్యేకంగా బ్యాంకు శాఖకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని బ్యాంకు వర్గాలు వివరించాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో డీమ్యాట్ ఖాతా ఉన్న వారు తమ నెట్ బ్యాంకింగ్ అకౌంట్లోకి లాగిన్ అయి, డీమ్యాట్ ట్యాబ్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. రుణ మొత్తం, షేర్లను సెలక్ట్ చేసుకున్న తర్వాత.. లోన్ అకౌంటు తెరవాలనుకుంటున్న శాఖ వివరాలను ఎంపిక చేసుకోవాలి. అటుపైన ఖాతాదారు దరఖాస్తు అందినట్లుగా బ్యాంకు నుంచి ఎస్‌ఎంఎస్ వస్తుంది. ఆ తర్వాత సమీపంలోని శాఖ నుంచి బ్యాంక్ సిబ్బంది.. ఖాతాదారు సంతకాలు తదితర వివరాలు తీసుకుంటారు. ఈ సులభతరమైన ప్రక్రియ వల్ల రుణ వితరణ సమయం 4-8 రోజుల నుంచి దాదాపు 24 గంటలకు తగ్గగలదని
 బ్యాంకు వర్గాలు తెలిపాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement