ఎయిర్పోర్ట్స్ విభాగంలో6 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు! | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్స్ విభాగంలో6 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు!

Published Thu, Sep 8 2016 12:13 AM

ఎయిర్పోర్ట్స్ విభాగంలో6 బిలియన్  డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు!

న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ విభాగంలోకి వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 6 బిలియన్ డాలర్లమేర (దాదాపు రూ.40,000 కోట్లు) పెట్టుబడులు రావొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే సమయంలో విమాన ప్రయాణికులు సంఖ్యలో 30 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే అభిప్రాయపడ్డారు. అపార వృద్ధి అవకాశాలున్న దేశీ విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఇటీవల కొత్త పౌరవిమానయాన పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వృద్ధికి నోచుకోని, నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి సహా రీజినల్ ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంది.

ఆయన ఇక్కడ జరిగిన జీఏడీ ఆసియా కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. వచ్చే పెట్టుబడుల్లో 1 బిలియన్ డాలర్లను ఎయిర్‌పోర్ట్‌ల పునరుద్ధరణకు ఉపయోగిస్తామని చెప్పారు. ఇక ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు చెందిన ఎయిర్‌డ్రోమ్స్ అప్‌గ్రేడింగ్‌కు 3 బిలియన్ డాలర్లను వినియోగిస్తామన్నారు. కాగా గతేడాది జనవరి-జూలై మధ్య కాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో దేశీ విమాన ప్రయాణికులు సంఖ్య 23 శాతం పెరిగిన విషయం తెలిసిందే. ఇక జూలై నెలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే.. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా 26 శాతంమేర ఎగసింది.

Advertisement
Advertisement