సియారామ్ ‘ఆటమ్ వింటర్ కలెక్షన్స్’ | Sakshi
Sakshi News home page

సియారామ్ ‘ఆటమ్ వింటర్ కలెక్షన్స్’

Published Tue, Feb 9 2016 1:55 AM

సియారామ్ ‘ఆటమ్ వింటర్ కలెక్షన్స్’

ముంబై: దేశీ ప్రముఖ టెక్స్‌టైల్ తయారీ కంపెనీ సియారామ్ సిల్క్ మిల్స్ ఇటీవల ముంబైలో ‘ఆటమ్ వింటర్ కలెక్షన్స్’ను ఏర్పాటు చేసింది. వీటిని ‘ఆల్ ఇండియా రిటైలర్ సమావేశం 2016’లో ప్రదర్శనకు ఉంచింది. సమావేశంలో దాదాపు 1,000 మందికి పైగా కంపెనీ రిటైలర్లు, భాగస్వాములు పాల్గొన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన డీలర్లు, భాగస్వాములను కలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక వేదికలా ఉపయోగపడిందని సియారామ్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ర మేశ్ పొద్దర్ తెలిపారు. డీలర్లు, భాగస్వాములతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ‘ఆల్ ఇండియా రిటైలర్’ కార్యక్రమం ఉపకరించిందని సియారామ్ సిల్క్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌరవ్ పొద్దర్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement