హైదరాబాద్‌లో సోలార్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సోలార్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం

Published Thu, Jul 23 2015 1:22 AM

హైదరాబాద్‌లో సోలార్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం - Sakshi

ఆగస్టు నుంచి శిక్షణ తరగతులు
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సోలార్ రంగానికి అవసరమైన నిపుణులను అందించేందుకు హైదరాబాద్‌లో సోలార్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం ఏర్పాైటైంది.  సోలార్ ఎనర్జీ ట్రైనింగ్ నెట్‌వర్క్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనివేబుల్ ఎనర్జీ అనుమతితో సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ దీనిని స్థాపించింది. బేగంపేట బ్రాహ్మణవాడిలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ భవనంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీన్లో... పాలిటెక్నిక్, ఐటీఐ పూర్తి చేసిన వారికి సూర్యమాన్ పేరుతో సాంకేతిక అంశాలను బోధిస్తారు. ఇంజనీరింగ్ పూర్తయిన, చదువుతున్న వారికి కోణార్క్ పేరిట టెక్నికల్, డిజైనింగ్ అంశాలను నేర్పుతారు. ఈ రెండు కోర్సుల కాల పరిమితి 30 రోజులు. ఆగస్టు 8 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. బ్యాచ్‌కు 30 మందికి చొప్పున శిక్షణ ఇస్తారు.

 30% అవకాశాలు ఇక్కడే..: సోలార్ రంగంలో నిపుణుల కొరత చాలా ఉంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఏర్పాటవుతున్న సోలార్ ప్రాజెక్టుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 20% ఉండనుందని స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రం ప్రమోటర్, ఫోర్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ఎండీ బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి తెలి పారు. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శేఖర్, సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి సురభి వాణీ దేవితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement
Advertisement