స్పైస్ జెట్ ‘ప్రి-సమ్మర్ సేల్స్’ | Sakshi
Sakshi News home page

స్పైస్ జెట్ ‘ప్రి-సమ్మర్ సేల్స్’

Published Wed, Feb 24 2016 1:00 AM

స్పైస్ జెట్ ‘ప్రి-సమ్మర్ సేల్స్’

న్యూఢిల్లీ: దేశీ విమానయాన  సంస్థ స్పైస్‌జెట్ తాజాగా మూడు రోజుల ‘ప్రి-సమ్మర్ సేల్స్’ను ప్రకటించింది. ఇందులో భాగంగా దేశీ నాన్‌స్టాప్ విమాన టికెట్లను రూ.599 నుంచి ప్రయాణికులకు (ఒకవైపు ప్రయాణానికి) అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. గురువారం వరకు అందుబాటులో ఉండనున్న ‘ప్రి-సమ్మర్ సేల్స్’లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్నవారు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని తెలిపింది.

Advertisement
Advertisement