స్వల్ప లాభాలతో, పటిష్ట ముగింపు | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలతో, పటిష్ట ముగింపు

Published Mon, Jun 5 2017 3:50 PM

stock markets ends with a possitive note

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో   ముగిశాయి.  అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో  నష్టాలతో ప్రారంభమైనా చివరికి సెన్సెక్స్‌ 31309(+36), నిఫ్టీ   9675 (+22) వద్ద స్థిరంగా ముగిశాయి. ప్రధానంగా 97వేల వైపు పరుగులు తీస్తోంది.  మిడ్‌ సెషన్లో కొనుగోళ్లతో  బాగా బలపడిన నిఫ్టీ 9687 తాకింది. చివర్లో ప్రాపిట్‌బుకింగ్‌ కారణంగా   కొంత లాభాలను కట్‌ చేసుకుంది.  మెటల్‌ ఇండెక్స్‌ ఒకటే నష్టపోగా మిగిలిన అన్ని సెక్టార్లు లాభాల్లో ముగిసాయి.  రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్‌ 1-0.5 శాతం మధ్య పురోగమించాయి.


అలాగే జీఎస్‌టీలో 3శాతం పన్నురేటు నేపథ్యంలో జ్యువెల్లరీ షేర్లు మెరుపులు మెరిపించాయి.  టైటన్‌, పీసీ జ్యువెలర్స్‌  బాగా లాభాపడ్డాయి. 
అలాగే  అప్పుల ఆందోళనలపై రిలయన్స్‌  క్యాపిటల్‌ అధినేత  అనిల్‌ అంబానీ  స్పందించడంతో ఆర్‌కాం దాదాపు 5 శాతం లాభపడింది. టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ టాప్‌గెయినర్‌గా నిలువగా వీటితో పాటు రేమండ్‌, డీబీ రియాల్టీ,  ఇండియా బుల్స్‌, ఎస్‌ బ్యాంక్‌, ఐవోసీ , టాటా ఎలక్సీ, యునైటెడ్‌ స్పిరిట్స్‌, హెక్సావేర్‌, అరవింద్‌ భారీ లాభాలను ఆర్జించాయి.  కేపీఐటీ, సింటెక్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఐఎఫ్‌సీఐ, జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పీఎఫ్‌సీ  నష్టపోయాయి.

అటు డాలర్‌  మారకంలో రుపీ 0.10 లాభపడి రూ. 64.44 వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో పుత్తడి  భారీగా లాభపడింది. రూ.209 ఎగిసి  పదిగ్రా.బంగారం రూ. 29, 080 వద్ద ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement