రెండో రోజూ మద్దతు స్థాయి దిగువనే | Sakshi
Sakshi News home page

రెండో రోజూ మద్దతు స్థాయి దిగువనే

Published Tue, Jan 2 2018 4:02 PM

stockmarkets end with Flat note - Sakshi


సాక్షి,ముంబై: ఆరంభంనుంచీ దేశీయ స్టాక్‌మార్కెట్లు  కన్సాలిడేషన్‌  బాటపట్టాయి. లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతూ  చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు రెండూ కీలక మద్దతు స్థాయిలకు దిగువనే ముగిశాయి.బ్యాంక్‌ నిఫ్టీ, రియల్టీ, ఫార్మా, టెలికాం నష్టపోయాయి.   ఆటో, మెటల్‌  సెక్టార్‌ లాభపడింది. ఐషర్‌ మోటార్స్‌, భారతి ఎయిర్‌టెల్‌​ భారీగా నష్టపోగా టాటామోటార్స్‌, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ లాభపడ్డాయి. ముఖ్యంగా  విక్రయాలు భారీగా జంప్‌ చేయడంతో టీవీఎస్‌  మోఆర్‌ షేరు 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది.డీఎల్‌ఎఫ్‌, రిలయన్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐబీ హౌసింగ్‌, బీపీసీఎల్‌, అరబిందో, ఎస్‌బీఐ, ఐవోసీ, మారుతీ, ఎల్‌అండ్‌టీ, వర్క్‌హాడ్‌, గ్రాన్యూల్స్‌,నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.

 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement