స్వల్ప లాభాలకు పరిమితమైన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్ప లాభాలకు పరిమితమైన మార్కెట్లు

Published Tue, Jun 26 2018 4:15 PM

Stockmarkets ends with Flat - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.  ఆద్యంతం స్తబ్దుగానే సాగిన కీలక  సూచీలు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌  కేవలం 20 పాయింట్ల లాభంతో 35,490, నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప లాభంతో  10,769 వద్ద  ముగిసింది.  ఎఫ్‌ఎంసీజీ, ఐటీ లాభపడగా.. రియల్టీ, ఆటో, ఫార్మా, మెటల్‌   నష్టపోయాయి.  గ్రాసిమ్‌, కోల్‌ ఇండియా, అల్ట్రాటెక్‌, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్, మారుతీ, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌  లాభపడ్డాయి.  టాటా మోటార్స్‌, ఆర్‌ఐఎల్‌, సిప్లా, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐషర్‌, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్‌  నష్టాల్లో ముగిశాయి. అటు ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పుత్తడి బలహీనంగా ఉంది. 10 గ్రా. ధర 182 రూపాయలు క్షీణించి 30, 475 వద్ద ఉంది.
 
 

Advertisement
Advertisement