Sakshi News home page

ఫ్లాట్‌ ముగింపు: ఐటీ షాక్‌

Published Tue, Mar 13 2018 3:42 PM

stockmarkets ends with Flat note - Sakshi



సాక్షి, ముంబై: తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన దేశీయ స్టాక్ మార్కుట్లు  చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి.  ముఖ్యంగా ఆరంభంలో లాభాలతో ఉన్న   సూచీల్లో  మిడ్‌సెషన్‌ తరువాత అమ్మకాలు పెరగడంతో ఒక్కసారిగా నష్టాలలోకి  జారుకున్నాయి. చివరికి  సెన్సెక్స్‌ 61 పాయింట్లు క్షీణించి 33,856 వద్ద , నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 10,400పైకి ఎగువన ముగిసింది.  
 వరుస నష్టాలనుంచి పీఎస్‌యూ కోలుకోగా ఐటీ దెబ్బతీసింది.  రియల్టీ , ఫార్మా పాజిటివ్‌గా ముగిశాయి.  వాటా అమ్మకం వార్తలతోటీసీఎస్‌ భారీగా నష‍్టపోయింది. అతుల్‌ లిమిటెడ్‌,  సీజీ కన్యూమర్‌,  హెచ్‌సీఎల్‌ టెక్, కొటక్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, మారుతీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌, ఎల్‌అండ్‌టీ, సిప్లా, అంబుజా నష్టాల్లోనూ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యాక్సిస్‌, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, విప్రో, సన్ ఫార్మా, ఐషర్‌, గెయిల్‌  నష్టాల్లోనూ ముగిశాయి.

Advertisement

What’s your opinion

Advertisement