భారీ లాభాలు: నిఫ్టీ 10,300కి పైన | Sakshi
Sakshi News home page

భారీ లాభాలు: నిఫ్టీ 10,300కి పైన

Published Thu, Apr 5 2018 3:55 PM

Stockmarkets Ends with Huge Gains - Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో  స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి.  సెన్సెక్స్ 578‌  పాయింట్లు పుంజుకుని 33,596 వద్ద, నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో 10,325 వద్ద ముగిశాయి.   నిఫ్టీ 10300 స్తాయికిఎగువన ముగియగా..  ముఖ్యంగా పాలసీ రివ్యూతో బ్యాంక్‌ నిఫ్టీ ఏకంగా 630పాయింట్లకు పైన పుంజుకుంది. ప్రబ్లిక్‌, ప్రయివేట్‌ బ్యాంకింగ్‌ షేర్లన్నీ లాభాల్లో ముగిశాయి. యాక్సిస్‌, ఎస్‌బ్యాంకు,  సిండికేట్‌, యూనియన్‌ ,అలహాబాద్‌, ఆంధ్రా, కోటక్‌, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, విజయ బ్యాంకు తదితర  కౌంటర్లు లాభాలనార్జించాయి.  టాటా మోటార్స్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటో కార్ప్ టాప్‌ గెయిన‍ర్స్‌గా ఉన్నాయి.   అదానీ, క్వాలిటీ నష్టపోయాయి. అటు పాలసీ రివ్యూతో దేశీయ కరెన్సీకూడా పాజిటివ్‌గా ఉంది. డాలర్‌మారకంలో 0.15పైసలు ఎగిసి 65రూపాయల వద్ద ఉంది. 

 

Advertisement
Advertisement