బుల్ దౌడు : ట్రిపుల్ సెంచరీ | Sakshi
Sakshi News home page

బుల్ దౌడు : ట్రిపుల్ సెంచరీ

Published Fri, Jun 5 2020 9:24 AM

stockmarkets gains 300 points - Sakshi

సాక్షి,  ముంబై :  దేశీయ స్టాక్ మార్కెట్ తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది.  వరుస లాభాలకు నిన్న (గురువారం) స్వల్ప విరామం ఇచ్చిన సూచీలు  నేడు తిరిగి పుంజుకున్నాయి.  ప్రస్తుతం సెన్సెక్స్  301 పాయింట్లు ఎగిసి 34269 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 10122 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి.  దీంతో సెన్సెక్స్ 34 వేల ఎగువకు  చేరింది.  నిఫ్టీ 10100 ఎగువన పటిష్టంగా వుంది. ప్రధానంగా వరుస మెగా డీల్స్ ను ప్రకటిస్తుండటంతో రిలయన్స్ షేరు  రికార్డు స్థాయిని  తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేర్ ధర 2 శాతం  లాభంతో  రూ.1,615 ని టచ్ చేసింది. (జియోలో పెట్టుబడుల ప్రవాహం: మరో మెగా డీల్)

ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, భారతి ఇన్‌ఫ్రాటెల్, యుపీఎల్, హిందాల్కో , సన్ ఫార్మ లాభపడుతున్నాయి. మరోవైపు టీసీఎస్, భారత్ పెట్రోలియం, పవర్ గ్రిడ్ నష్టపోతున్నాయి. 

Advertisement
Advertisement